Maro manishi
అధీ ఒక యూనివర్సిటీ ఎక్సమ్ అందరూ ఆ ఎక్సమ్ రాసి సీట్ సంపాదిస్తే,తాను మాత్రం అందరి హృదయాలు గెల్చుకుంది . తన కళ్ళు కాటుకకే అందాన్ని తెచ్చిపెట్టేలా . తన పెదవులు మృదువయినా పూలా రేఖలులా . తన శరీరం ఆకాశం లో తేలుతున్న పల్చని తుమ్మెద రెక్కలా . తాకితే కరిగిపోయే నీటి మంచు లా వర్ణిస్తే తరగని తన అందంతో తన మేధాశక్తి తో ఆ యూనివర్సిటీ లోని సీట్ మరియు కుర్రాళ్ళ హృదయాలను గెల్చుకుంది సుహాసిని .
సుహాసిని యూనివర్సిటీ ఎక్సమ్ లో టాప్ వచ్చి ఆ యూనివర్సిటీ లోని స్పెషలైసెషన్ అఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనే కోర్స్ లో జాయిన్ అయింది . తాను అకౌంట్స్ ని నమిలి మింగేసిందా అన్నట్టు, ఎంతో చాకచక్యంగా అసలు సమయాన్నే ఆశచర్య పరిచేలా తన జోరు కి అందరూ ఫిదా .
రాహుల్ ,చిన్నప్పటి నుంచి చదువులో , ఆటల్లో ,కలల్లో మంచి పట్టు సాధించిన ఒక సాధారణ అబ్భాయి తనకి మాత్ అంటే మక్కువ ఉండటం వాళ్ళ తాను కూడా ఈ యూనివర్సిటీ పరీక్షలో పాల్గొని రెండవ ర్యాంక్ సంపాదించి స్పెషలిసెషన్ అఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనే కోర్స్ లో జాయిన్ అయ్యాడు .
మొదటి చూపులోనే అందరిలా సుహాసిని అందానికి మైమర్చిపోయాడు కానీ అతను జీవితం లో ఏదో సాధించాలి అనే తపన పట్టుదల కల్గిన వ్యక్తీ . ఇలా కొన్ని రోజులు గడిచాక పరీక్షల సమయం వచ్చింది అందరూ ఎంతో కష్టపడ్తు చదువుతూ తమని తాము ఎలాగైనా ఈ పరీక్షా ద్వారా నిరూపించుకోవాలని కృషిలో ఉండగా సుహాసిని మాత్రం ఎటువంటి తపన లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా ఆటలు ఆడుతుంది అది కూడా సీనియర్స్తో అది గమనించిన రాహుల్ తనని తప్పుగా అర్ధం చేసుకుంటాడు .పరీక్షలు ముగుస్తాయి . ఫలితాలు ప్రకటించారు అందరూ నోటీసు బోర్డు దెగ్గర గుంపు కూడారు మల్ల మొదటి స్థానంలో సుహాసిని రెండవ స్థానంలో రాహుల్ . రాహుల్ ఎంతో ఆశ్చర్యపోయాడు ఏంటి అసలు ఎక్సమ్ అంటే ఏమి పట్టనట్టు ఆటలాడుతూ ఎప్పుడు ఏదో ఒక సంబంధం లేని పనులు చేస్తూ ఉండేది ఎలా మొదటి స్థానంలో ర్యాంక్ సాధించిందా అని ఇంకా ఆ రోజు నుంచి తనని గమనిస్తూ వున్నాడు రాహుల్, రోజు క్లాస్సేస్ అవ్వగానే పార్క్ కి పోయి అక్కడ చిన్న పిల్లలతో గంతులు వేస్తూ రోడ్ మీద వాహనాలు వచ్చే సమయంలో అసలు అటు ఎటు ఎందుకు తిరుగుతూ ఉందొ తన మనస్తత్వం ఏంటో అర్ధమే కాలేదు రాహుల్ కి కానీ తాను చిన్న పిల్ల ల ఆడుకోవడం మరలా చదువులో అందరిని వెనక్కునెట్టి తన సత్తా చాటటం బాగా ముచ్చటిగా అనిపించింది రాహుల్ కి తనతొ ప్రేమలో పడ్డాడు . కలిసి మాట్లాడాలి పరిచయం పెంచుకోవాలి అనుకున్నడు .
తనతో మాట్లాడాలనే కుతూహలతా అతనిలో బాగా ఏర్పడింది కానీ ఎలా మాట్లాడాలో అర్ధం కట్లెద్ . తను పార్క్ కి వస్తది అని పార్క్ లో ఎదురుచూస్తూ కూర్చున్నాడు రాహుల్ . సమయం మెల్లగా దాటిపోతుంది కానీ సుహాసిని రక కనబడట్లే. ఇంకా ఇవ్వాళ రాదేమో అనుకోని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాహుల్. మరుసటి రోజు క్లాస్ లో ఎంతో బెంగతో బయటకి చూస్తూ కూర్చుంది సుహాసిని . మనసు మాట్లాడమంటున్న ఒక వయిపు తనతో మాట్లాడాలి అంటే భయమేస్తుంది ఏదయితే అది అయింది అని వెళ్లి సుహాసిని అని పిలుస్తాడు అప్పుడు ఒక్కసారిగా తాను చూస్తది రాహుల్ని సుహాసిని . సుహాసిని రాహుల్ ని పై నుంచి కింది వరకు మెల్లగా స్కాన్ చేసినట్టు చూపు చూస్తది . తాను కళ్ళతోనే మాట్లాడేస్తదా అన్నట్టు అనిపించింది రాహుల్ కి నేను ఇక్కడ కూర్చొచ్చ అని అడిగాడు రాహుల్ . సుహాసిని పక్కకు జరిగి కూర్చుంటది ఒక్క మాట కూడా మాట్లాడకుండా . దొరికిన మొదటి అవకాశం చెయ్ జారిపోయినట్టు అనిపించింది మల్ల గుండెని గట్టిపరచుకొని సుహాసిని అని పిలిచాడు రాహుల్ సుహాసిని చలనమే లేని రాయి లా ఆకాశం వయిపు చూస్తూ కూర్చుంది రాహుల్ మల్ల సుహాసిని అని పిలిచాడు ,సుహాని తిరిగి చూసింది .
రాహుల్ నా పేరు అన్నాడు ,నేను నిన్ను గత నెల రోజులుగ చూస్తున్న నువ్వు అసలు అంతుచిక్కలేని ఒక చిన్ని పాపా మనస్సుగల మనస్తత్వం కలిగి వున్నా ఒక అద్భుతమయినా మనిషివి నాకు నిన్ను చూస్తున్నప్పుడల్లా ఏదో తెలియని అనుభూతి . నీతో మాట్లాడాలి అనే భావన అని అంటాడు . అంత ఒకటేసారి వణుకుతూ చెప్పిన కూడా ఎం పట్టనట్టు చూస్తది సుహాసిని . నువ్వు కూడా ఏదో ఒకటి మాట్లాదోచుగా అంటాడు రాహుల్ .
సుహాసిని కూడా మాట్లాడతది ఇంకా అలా అలా మాటలు సాగుతాయి ఎప్పటిలాగానే క్లాస్సేస్ అయ్యాక సుహానితో పాటు కలిసి రాహుల్ కూడా పార్క్ కి పోతాడు అక్కడ సుహాసిని పూలని వాటిమీద వాలుతున్న సీతాకోకచిలుకలని పట్టుకోటాకిని ప్రయత్నిస్తూ ఆడుతూ వుంటది రాహుల్ సుహాసినిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు . సుహానిని తరువాత చిన్న పిల్లలలా మట్టితో ఆడుతూ వుంటది సుహాసిని చాల తక్కువ మాట్లాడతది ఎప్పుడు నవ్వుతూ అన్నింటిని కొత్తకోణం లో ఎప్పుడు చుడన్నట్టుగా ఆసక్తితో చూస్తూ వుంటది . చిన్న చిన్న వాటికే సంతోష పడుతూ వుంటది చిన్న పిల్ల లా .
సుహాసిని మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది రాహుల్ కి ఇంక తనని తాను అదుపుచేసుకోలేక ఒక రోజు సుహాసినితో తన ప్రేమ సంగతి చెప్తాడు . అది విన్న సుహాసిని ఏమి చెప్పకుండా ఆందోళనతో అక్కడ నుంచి వెళ్ళిపోతది . సుహాసినిని బాధ పెట్టానే అనే ఆందోళనలో రాహుల్ చింతిస్తుండగా సుహాసిని రాహుల్ కి ఫోన్ కాల్ చేస్తది కేఫ్ లో రేపు ఉదయం కలుదాం అని చెప్తది , తాను ఎం చెప్తాదో అని ఒక వయిపు బయమేస్తున్న రాహుల్ రేపు సుహాసిని కేఫ్ లో కలవబోతున్న అనే ఆనందం లో ఊగిపోతాడు . మరుసటి నాడు మంచిగా తాయారు అయ్యి సుహానిని కలవడానికి కేఫ్ కి పోతాడు . కేఫ్ లో సుహాసిని పక్కన ఒక మనిషి కూర్చొని ఉంటాడు చుట్టూ జనాలు ఎవరు వుండరు వాళ్ళు ఇద్దరు మరియు రాహుల్ మాత్రమే వుంటారు .
ఆ మనిషిపేరు అన్వేష్ క్షత్రియా ,ఈ అన్వేష్ క్షత్రియ ఎవరు ఇతనికి సుహాసిని ఏంటి సంబంధం అసలు అతను ఇక్కడ ఎం చేస్తున్నాడు అసలు కేఫ్ లో ఇంకా ఎవరు ఎందుకు లేరు ఇదంతా రాహుల్ కి అంతుచిక్కలేదు . అన్వేష్ రాహుల్ కి చేయి ఇచ్చి షెక్ హాండ్ ఇస్తాడు రాహుల్ అమాయకంగా అతని చేయి కూడా ఇస్తాడు . సుహాసిని టేబుల్ వయిపు చూస్తూ చలనమే లేని ఒక బొమ్మల కూర్చొని వుంటది . సుహాసిని ప్రవర్తన ముందటి లాగా లేదు ఎప్పుడు కిలకిలా నవ్వుతు వుండే సుహాసిని ఎందుకు అంత డల్ గా ఉందొ అర్ధం కాలే రాహుల్ కి .
మాటలు సాగిచాడు అన్వేష్ క్షత్రియా . నువ్వు సుహానిని ప్రేమిస్తున్నావా అని డైరెక్ట్ పాయింట్ కి వచ్చాడు అన్వేష్ ,రాహుల్ కి ఒకటేసారిగా అలా అడిగే సరికి మాటలు రాలేదు తడబడుతూ చెమటలు చిందుతూ హా అన్నాడు . నీకు సుహాసిని ఎప్పటి నుంచి తెల్సు అని అడిగాడు అన్వేష్ రాహుల్ ని ,రాహుల్ అయోమయంతో నాకు ఒక 4 నెలలుగా తెల్సు అని చెప్పుకొస్తూ మీరు సుహాసినికీ ఎం అవుతారు అంటాడు . నేను సుహాసినికి ఫాదర్ లాంటోడిని అని నవ్వుతు అంటదు అన్వేష్ . ఆ మాట వినడానికి వినసొంపుగా వున్నా కూడా నమ్మేలా లేదు రాహుల్ కి . ఆశ్చర్యంతో ఫాదర్ ఆ అంటాడు . అన్వేష్ నవ్వుతు అవును ఫాదర్ ని ఎం ఆలా కనిపివ్వట్లేదా అంటాడు అన్వేష్ . అసలు అనిపివ్వట్లేదు మీరు చుడానికి ఒక 22 ఏళ్ల వ్యక్తి ల వున్నారు అంటాడు రాహుల్. చూడటానికే కాదు నాకు నిజంగానే 22 సంవత్సరాలు అంటాడు అన్వేష్ . నేను తన ఫాదర్ లాంటోడిని తాను నా కూతురు లాంటిదే కానీ నిజంగానే నా కూతురు కాదు అంటదు.
అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏం అర్ధం కాట్లే రాహుల్ కి . ఇంకా కొంచం కొంచం కోపం తెచ్చుకుంటూ అసలు ఎవరు మీరు ఎం మాట్లాడుతున్నారు .మీకు సుహాసినికి ఏంటి సంబంధం, అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు, ఇప్పుడు మీరు ఎం మాట్లాడుతున్నారు అని ప్రశ్నల తూటాలు పేలుస్తాడు .
నీకు వచ్చిన ప్రశ్నలాంటి నా దెగ్గర సమాధానాలు వున్నాయి కానీ చెప్పాలి అంటేనే భయమేస్తుంది అంటాడు అన్వేష్ క్షత్రియా . రాహుల్ ఒక్కసారిగా సుహాసిని వాయిపుగా చూసి సుహాసిని అంటాదు సుహాసిని తల ఎత్తి చూస్తది ఎంతో అమాయకంగా . ఏం జరుగుతుంది సుహానిని నువ్వు ఎందుకు మాట్లాడటలేదు అని అడుగుతాడు రాహుల్ . తాను ఏం మాట్లాడలేదు అంటదు అన్వేష్ . ఎందుకు మాట్లాడలేదు ఏమైంది అంటాదు రాహుల్, తను నువ్వు అనుకుంటున్నట్టుగా సుహాసిని కాదు అసలు తను మనిషే కాదు అంటాడు అన్వేష్ , ఈ మాట విన్నాక అసలు ఎం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు రహుల్కి .
సుహాసిని చేయిని పైకి లేపి వదిలేస్తాడు అన్వేష్ ఆ చేయి టేబుల్ కి తగిలి ఒక ఇనుము లా శబ్దం చేస్తది . ఒకటే సారిగా కుర్చిలోకి వెనక్కి ఒరుగుతాడు రాహుల్ ఏంటి మీరు చెప్పేది సుహాసిని మనిషి కాదా అని తన కళ్ళలో నుంచి కంటి నీరు ని వదులుతూ ఆశ్చర్యం తో అడుగుతాడు రాహుల్ . అన్వేష్ అవును నేను చెప్పేది నమ్ము తను అమ్మాయి కాదు అసలు మనిషే కాదు తను మరమనిషి అంటూ చెప్పుకొస్తాడు అన్వేష్ తనని నేనే తాయారు చేశా ఈ సమాజం లో తాను ఒక మనిషి ల కలిసిపోయింది ఇన్నాళ్ళు అంటాడు అన్వేష్ .
అంటే సుహాసిని మనిషి కాదా తనొక రోబోట్ ఆ ఇన్నాళ్ళు తాను అంత కొత్త కొత్తగా ప్రవర్తించిందీ ఇందుకా ఒక రోబోట్ ని ఒక యూనివర్సిటీ ఎక్సమ్ రాపిచ్చి జాయిన్ చేసావా మా అందరి మనసుల తో సమాజం తో ఆడతావా అని ఏడుస్తూ అన్వేష్ ని కొట్టడానికి ప్రయత్నిస్తాడు రాహుల్ , ఇంతలో ఒక పెద్ద సమ్మోహం లోని వ్యక్తులు పిస్టల్ ని రాహుల్ కి గురిపెడ్తారు కొంతమంది వచ్చి రాహుల్ ని లాగి కింద పడేసి అన్వేష్ ని కాపాడతారు . అసలు వాళ్లంతా ఎవరో ఏంటో ఎందుకు ఒకటే సరిగా ఊడిపడ్డారో అర్ధమే కాలేదు రాహుల్ కి . సుహాసిని మాత్రం ఇంత జరుగుతున్న ఆ తల ఎత్తకుండా ఆ టేబుల్ దెగ్గరే కూర్చొని వుంది . రాహుల్ కి గుండె నిండా బాధ కళ్ళలో నీరు అసలు ఏమీ అర్ధం కాకా కింద పది ఏడుస్తుంటాడు . అన్వేష్ రాహుల్ దెగ్గరికి పోయి నన్ను క్షమించు రాహుల్ నేనూ ఇది నిన్ను కానీ ఎవరినికూడా బాధపెట్టాలి అని చేయలేదు , అని అతని గతాన్ని చెప్పుకొస్తాడు .
" నా పేరు అన్వేష్ క్షత్రియ మా నాన్న గారి పేరు ధర్మ క్షత్రియ. మా తాతగారు కృష్ణానంద క్షత్రియ మేము క్షత్రియులం,మా నాన్న గారి సమయం లో క్షత్రియుల మీద ఈ సమాజం లో అప్పట్లో వుండే గౌరవం లేకుండా పోయింది ఇప్పుడు అంతా మాములు మానుషులే ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే బావాలు పోయాయి కానీ మా కుటుంబంలో ఇప్పటికి రాజులూ ప్రజలు అనే భావాలూ నారా నరాల్లో పాత్తుకొని పోయాయి . ఒక రాజు కొడుకు అందరి సమానులతో కల్సి తిరగడం ,చదువుకోడం ,అందరితో కాల్సిమెల్సి పోవటం లాంటివి మా కుటుంబంలో లేవు , నేను నా చదువు మొత్తం మా ఇంట్లోనే పూర్తి చేశా నాకు ఏప్పుడు కూడా బయట ప్రపంచం మీద ధ్యాస మళ్ళలేదు , నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పని చేసేవాళ్ళు తప్ప ఎవరు తెలీదు వాళ్ళతోనే ఆడుకునేవాడ్ని నాకు చదువు అంటే చాల ఇష్టం నాకేం కావాలన్నా నా కాళీ దెగ్గరికి తెచ్చిపెట్టేవాళ్ళు మా అమ్మ నాన్న . నేను నా గ్రాడ్యుయేషన్ కూడా మా ఇంట్లోనే పూర్తి చేశా . ఇటీవల కాలం లో మా అమ్మ గారు నాన్న గారు వేరే దేశపు మా బంధువులని కలవాడానికి విమానం లో ప్రయాణిస్తూ ప్లేన్ క్రాష్ అయి చనిపోయారు . వారే నా ప్రపంచం లాగా బతుకుతున్న నాకు ఒకటే సారిగా పంపంచం లో ఒంటరి పక్షిని అయ్యా అనే భావన కలిగింది . బయట సమాజం వయిపు చూపు మళ్లింది కానీ బయట సమాజం నాకు లెలియనిది నాకు కొత్తది, నాతో ఎవరు లేక నాకు నేను గా ఈ సుహాసినిని తాయారు చేశా కానీ నాకు ఎందుకో అది నేను తాయారు చేసిన యంత్రమే అనే ఆలోచన ,బయట సమాజాన్ని చూడాలనే ఆశ రెండు కలగడం వల్ల ఒక రోజు మా ఇంట్లో నుంచి పారిపోయి రోడ్ మీద కి వచ్చా ఇక్కడ నాకు చిన్న పిల్లలు కూడా దాటగలిగే రోడ్ దాటటం కూడా చేతకాలేదు నాకు ఎవరితో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు .మరల మా ఇంటికే తిరిగి వచ్చేసి నాలో నేనే ఏడవటం ,నాకు ఎం చేయాలో తోచని స్థితి లో ఈ సుహాసిని ఇలా సమాజం లోనికి పంపించి తనధ్వారా నేను ఈ సమాజాన్ని సమాజంలోని మనుషులకి దెగ్గరవ్వాలి అనుకోని ఆ యూనివర్సిటీ లో జాయిన్ చేశా . తన ధ్వారా నేను ఈ ప్రపంచాన్ని చుట్టి అన్ని ప్రదేశాలను తిరుగుతున్న, నేను చిన్నప్పటి నుంచి చూడలేని వాటిని ఇప్పుడు చూస్తూ వచ్చా అని చెప్తాడు ".
ఇదంతా వినడానికి కొత్తగా ఆశ్చర్యాయంగా వున్నా కూడా అతని మాటల్లో నిజాయితీ రాహుల్ కి కనిపిచింది అతను భరించిన ఆ ఒంటరితనం అతని మాటల్లో కనిపిచింది . కానీ ఒక యంత్రాన్ని మనుషులలో కలిసిపోయేలా చేసి మనుషుల మనసులతో ,సమాజంలోని నిభంధనలతో ఇలా ఆడుకోవడం సరియైనది కాదు నువ్వు ముందు ఈ సుహాసిని అనే యంత్రాన్ని కూల్చివేయు (డిస్మంటిల్ ) చేయు , లేదా ఈ ప్రభుత్వానికి అప్పజెప్పు అని అంటాడు . ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మళ్ల వచ్చి నువ్వు నీకు ఎవరు లేరు అనుకోకు నువ్వు రేపటి నుంచి మా హాస్టల్ లో జాయిన్ అవ్వు నీకు ఈ రాహుల్ అనే స్నేహితుడు వున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు .
***********కథ సూకాంతం ************
OMG.!!! Mind Blowing Story....
ReplyDeleteWow!! The way you written the story was awesome 👌. Keep writing and expressing. Lovable story ❤
ReplyDelete