Arjunathantram
ఓపెన్ చేస్తే షాట్ లోకి ఓక బస్ వచ్చి ఆగింది ,కొంతమంది బస్సు ఎక్కారు ఇంకొంతమంది దిగారు ,అది హైదరాబాద్ నగరం బస్సు కదులుతూ ఉండగా అక్కడే రోడ్ మీద ఒక అతను ఆ బస్సు వయిపుగా చూస్తూ సిగ్గు పడ్తూ ఎవరినో చూసి నవ్వుతూ ఉంటాడు , వెనకాల ఒక విండో సీట్ లో ఒక అతను పాటలు వింటూ బయటకి చూస్తూ ఉంటాడు ఇతనే మన కథానాయకుడు అతనికి ఈ మనిషి కనిపిస్తాడు ఎవరికి సైగలు చేస్తున్నాడా అని చూడగా ఒక అందమైన అమ్మాయి తాను కూడా పాటలు వింటూ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది . తనే మన కథానాయకురాలు ,తనని మొట్టమొదటి సారి చూడగానే గుండెల్లో గంటలు మ్రోగుతాయి మన కథానాయకునికి , బస్సు మరల స్టార్ట్ అయితది ఇంక మన కథానాయకుడు బస్సు జర్నీ అంతా మన కథానాయకురాలిని చూస్తూనే గడిపేస్తాడు . మన కథానాయకురాలి పేరు ఆనంది తను ఒక సాఫ్ట్వేరు ఉద్యోగిని .
ఆనంది హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ హాస్టల్ లో ఉంటుంది , ఆనంది తనతోపాటు ఇంకో ఇద్దరు రూంమేట్స్ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్స్ ,ఆనంది వాళ్ళ రూంమేట్స్ పేర్లు పద్దు ,వీణ . పద్దు మరియు ఆనంది మంచి స్నేహితులు ,ఒక రోజు ఆనంది మరియు పద్దు కలిసి కేఫ్ లో పద్దు బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి పోతారు , పద్దు బాయ్ ఫ్రెండ్ పేరు రోహిత్ ,మన కథానాయకుని పేరు అర్జున్ , అర్జున్ మరియు రోహిత్ మంచి స్నేహితులు తక్కువ కాలం లో తన గ్యాంగ్ లోకి వచేసాడు అర్జున్ ,పద్దు కి కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి అర్జున్ , ఆనంది మరియు పద్దు కేఫ్ దెగ్గర బైక్ పార్క్ చేస్తుండగా చూస్తాడు అర్జున్ ,వెంటనే అర్జున్ కి సంతోషం పట్టలేనంత కలుగుతది , కానీ ఎందుకో తెలీకుండా చాలా ఎక్ససైట్మెంట్ ఫీల్ అవుతాడు అర్జున్ ,వెంటనే ఆనంది తమ వయిపు వస్తుంది అని గ్రహించిన అర్జున్ తన టేబుల్ నుంచి లేసి వాష్రూమ్ కి పోతాడు . పద్దు మరియు ఆనంది వచ్చి రోహిత్ తో మాట్లాడి వెళ్లిపోయే సమయానికి అర్జున్ తనని తాను చాలా సముదాయించుకొని బయటకి వస్తాడు ,ఇంతలో వాళ్ళు వెళ్ళిపోడం గమనిస్తాడు అర్జున్ వెంటనే రోహిత్ తో ఆ పక్క టేబుల్ మీద ఉన్న స్పెక్ట్స్ వాళ్ళవే అంటూ మర్చిపోయారేమో నేను వెళ్లి ఇచ్చేసి వస్తా అంటూ రోహిత్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు వాళ్ళ దెగ్గరకి .
ఆనంది,పద్దు బైక్ దెగ్గర మాట్లాడుతూ నుంచుంటారు ఇంతలో అర్జున్ వచ్చి ఆనందిని పిలుస్తాడు ఇవి మారిపోయావు అంటాడు ,ఆనంది అవి నావి కావు అని చెప్తూనే ఉంటది కానీ అర్జున్ తన కళ్ళలోకి చూస్తూ తాను చెప్పేది ఏం వినిపించుకోడు ,వెంటనే తనని గట్టిగా పట్టుకొని తన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు ,సుమారు ఒకటిన్నర నిమిషాల పాటు గట్టిగ ఊపిరి ఆడకుండా ముద్దు పెట్టుకోడం వళ్ళ ఆనందికి ఊపిరి అందదు ఇంక వెంటనే పద్దు ఆపుతది ,ఇంకా ఆలా చూస్తూ ఉంటాడు అర్జున్ . పద్దు ఆనందిని తీస్కొని బైక్ మీద వెళ్ళిపోతారు ,ఆనంది భయం తో చూస్తునే ఉంటధి .
హాస్టల్ రూమ్ కి పోగానే ఆనంది వెంటనే పోయి మౌత్ క్లీన్ చేస్కుంటూ చాలా కోపం తో అతను తనకి చేసిన ఈ అవమానాన్ని గుర్తుచేసుకొని తిడ్తూ ఉంటది. ముందుగా అతనికి కరోనా ఉందేమో అని అంటది ఇంతలో పద్దు అలా ఏం లేదు నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్తది . కానీ ఇలాంటి వాళ్ళతో ఏం ఫ్రెండ్షిప్ రోహిత్ కి అతను ఒక ఇడియట్ లా ఉన్నాడు అని అర్జున్ ని తిడ్తూ ఉంటది ఆనంది,వెంటనే పద్దు అలా మాట్లాడకు నాకు అర్జున్ చాల బాగా తెల్సు ,అసలు చాల మంచోడు కానీ ఇలా ఎందుకు చేశాడో అర్ధం కావట్లేదు అంటది,అలానే మంచి వాళ్ళ ల నటిస్తుంటారు అలాంటి ఫ్రాడ్స్ అంటది ఆనంది,అప్పుడు నువ్వు అలా అనకు అదేదో తప్పుగా అయింది కానీ అర్జున్ చాల అంటే చాలా మంచోడు ,అమ్మాయిల జోలికి పోడు ,చాలా డీసెంట్ అతని పని అతను చూసుకుంటాడు అంటది పద్దు ,అవునా చాలా మంచోడు, కనిపిచిందిగా మధ్యాహ్నం నడి రోడ్ మీద ఒక ఆడ పిల్ల పరువు ఏమయితదా అని ఆలోచించకుండా అలా ముద్దు పెట్టుకోడం ,చాల డీసెంట్ అని వెటకారంగా అంటూనే అసలు ఇలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి ఎలాగో అది రోడ్ కాబట్టి అక్కడ సీసీటీవీ ఫ్యూటేజీ కూడా ఉంటది రెడ్ హాండెడ్ గా దొరికిపోతాడు అని అంటది , ఆనంది మాటలు వింటుంటే పద్దు కి భయం వేస్తది నిజంగానే తన ఫ్రెండ్ మీధ కంప్లైంట్ ఇస్తది అని వెంటనే ఆలా చేయకు ఇక్కడ నీ పరువు కూడా పోవచ్చు జరిగిందేదో జరిగింది గతం గతః అనుకోని వదిలేయి ఇంకేం ఆలోచించకు అని చెప్తది .
మరుసటి రోజు కేఫ్ లో పద్దు ,రోహిత్,అర్జున్ మరియు ఇంకొంత మంది వారి స్నేహితులు అలా మాట్లాడుకుంటూ ఉంటారు పద్దు ఏమో అర్జున్ని కోపడతది నిన్న నువ్వు చేసిన పనికి ఆనందికి చాల కోపం వచ్చింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా అని చెప్పింది నేనే తనని ఆపిన ,నువ్వు ఏదన్నా పని చేసేటప్పుడు ముందూ వెనక ఆలోచించవా, తన పరువు పోతదా అని ఆలోచించావా నడి రోడ్ మీద అలా అసలు ఎమన్నా బావుందా అని అంటది, ఇంతలో కిరణ్ అనే ఒక అతను వాళ్ళ గ్యాంగ్ లోని వ్యక్తి, అయితే ఎవరు చూడకపోతే ఓకే నా అంటాడు ,రోహిత్ అతనిని నువ్వు ఓర్లబాకు రా బాబు అని అంటాడు,ఇంతలో ఆ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి ఎంతయినా మనోడు మంచి ధైర్యవంతుడురా లేకపోతే చూసి చూడగానే ఆ అమ్మాయిని రోడ్ మీదా ఎంతయినా మనోడి ధైర్య సాహసాలను మెచ్చుకోవాలి రా అంటాడు ,అప్పుడు ఇంకొక వ్యక్తి ఆ తీస్కపొయి జైలు లోపల వేస్తే ఇంకా బాగా కనిపిస్తాయి రా ఇలాంటి సాహసాలు అంటాడు . ఇదంతా వింటున్న పద్దు ఏహేయ్ ఆపండి మీ సోది ,అర్జున్ నువ్వు ఎలా అయినా నా ఫ్రెండ్ ని క్షమించమని అడగాలి అంటది . అప్పుడు కిరణ్ ఏంటి సారీ చెప్పాలా దీనికి నేను ఒప్పుకోను అంటాడు ,నీకు ఏమైంది రా నువ్వు ఎందుకు మధ్యలో తల దూరుస్తున్నావ్ అంటాడు రోహిత్ . ఈ సంభాషణ అవుతున్నా కూడా ఏమి పట్టనట్టు తాను వేరే ఏదో పనిలో ఉంటాడు అర్జున్ ,సరే చెప్తాడు అర్జున్ నీ ఫ్రెండ్ కి సారీ ,నువ్వే ఎలా అయినా మరల కలిసేలా చేయాలి మరి అంటాడు రోహిత్ ,వెంటనే పద్దు ఆనందికి కాల్ చేస్తది .
ఆనంది కాల్ లిఫ్ట్ చేసి చెప్పు పద్దు అంటది ,ఎక్కడ ఉన్నావు నువ్వు అని ఆనందిని అడుగుతది పద్దు ,నేను ఆఫీస్ లో ఉన్నా ఏంటో చెప్పు అంటది ఆనంది, ఎం లేదు లంచ్ కి బయటకి వెళదాం వస్తావేమో అని కాల్ చేశా అంటది పద్దు ,లేదు లే నేను ఇక్కడే తినేస్తా నాకు తరువాత చాలా వర్క్ వుంది నీకు తెల్సుగా మా మేనేజర్ ఎలాంటోడో నాకు ఎక్కువ వర్క్ ఇచ్చి , ఎలా అయినా నన్ను వర్క్ చేయకుండా తప్పిచుకుంటా అని ప్రూవ్ చేయాలి అని చూస్తున్నాడు నా వర్క్ నేను ఎర్లీ గా కంప్లీట్ చేయాలి లేదంటే లేట్ అయితది అంటది . అయ్యూ ఎం కాదు లే తొందరగా తినేసి వెల్దువు వచ్చేయు అంటది పద్దు ,సరే లే అని కాల్ కట్ చేస్తది ఆనంది,పద్దు అర్జున్ తో ఆనంది వస్తా అని చెప్పింది మరల నా పరువు తీయకుండా తనకి సారీ చెప్పు అంటది. .
3rd టేబుల్ లో పద్దు ఆనంది కోసం చూస్తూ కూర్చుంటది 4th టేబుల్ లో అర్జున్ రోహిత్ మరియు అతని స్నేహితులు కూర్చొని ఉంటారు , ఆనంది హోటల్ కి తన ఆఫీస్ ఫ్రెండ్ తో కలిసి వస్తది ,వీళ్ళు ఇద్దరు పద్దు ఉన్న టేబుల్ దెగ్గరికి పోయి కూర్చుంటారు ,ఆనంది అక్కడే ఉన్న అర్జున్ ని గమనించదు , పద్దు మరియు ఆనంది హగ్ చేసుకొని పలకరించుకుంటారు ,ఆనంది ఆఫీస్ ఫ్రెండ్ మరియు పద్దు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని తమ తమ సీట్స్ లో కూర్చుంటారు ,వెయిటర్ ని పిలిచి పరోటా ఆర్డర్ చెపుతారు ,ఇంక సంభాషణ మొదలు పెడ్తారు ముందు రోజు జరిగిన విషయం గుర్తు చేస్తూ అర్జున్ పేరు పలకగానే ఆనంది అతని గురించి ఇప్పుడు చెప్పుకోడం ఎందుకు ,ఈసారి అతను కనిపిస్తే కాల్చేస్తా అని కోపంగా అంటది ,ఇంతలో ఆనంది ఆఫీస్ ఫ్రెండ్ నీ దెగ్గర గన్ కూడా ఉందా అని వెటకారంగా అంటది ,ఆనంది నాకు గన్ అవసరమే లేదు నేను కంటి చూపుతో మాడ్చి మసి చేయగలను అని గొప్పగా డైలాగులు చెప్తు ఉంటది ,వెంటనే అర్జున్ తన టేబుల్ మీద నుంచి లేసి 3rd టేబుల్ లో కూర్చున్న ఆనంది టేబుల్ దెగ్గరికి వచ్చి తన టేబుల్ మీద చేతులు పెట్టి ఆనంది వయిపుగా చూస్తాడు , వెంటనే తన డైలాగు పూర్తిచేయబోతున్న ఆనంది అర్జున్ ని చూసి ఒకటే సారి తల దించుకొని టేబుల్ వైపు చూస్తది,అర్జున్ ఆనంది వైపు చూస్తూ అబ్బో చాలా టాలెంట్ ఉందిగా నీకు అంటాడు ,సర్లేగని లే అంటాడు ,అయినా కూడా కిందకే చూస్తూ ఉంటది ఆనంది కళ్ళలో వాటర్ వస్తూ ఉంటాయి ,మరల గట్టిగా లే అంటడు అర్జున్ ,సడన్ గా లేసి నుంచుంటది ఆనంది,ఏదీ ని ముందే ఉన్న గా నన్ను కాల్చు నీ కళ్లతో అంటాడు అర్జున్ ,ఇంకా బయపడి ఏడుస్తుంటది ఆనంది, కిరనేమో ఇంకెక్కడా ఫైర్ బాబాయ్ అదిగో వాటర్ వచ్చాయి ఫైర్ ఆవిరి అయిపోయిందేమో అని నవ్వుతాడు గ్యాంగ్ అంతా నవ్వుతారు ,ఇంతలో పద్దు వచ్చి ఏంటి నువ్వు చేసేది అర్జున్ నువ్వు సారీ చెప్తా అంటే నేను తనని ఇక్కడికి పిలిచా ,నువ్వు మరల తనని ఏడ్పిస్తున్నావ్ అని అంటది ,అర్జున్ ఏమో నెక్స్ట్ టేబుల్ లో కూర్చోమని ఆనందితో అంటాడు ఆనంది కూర్చుంటది ,ఇంక అర్జున్ ఆనందికి నేను చేసినదానికి నువ్వు ఫీల్ అయ్యావ్ అంటగా ,నేను కావాలని చేయలేదు ఆ టైం లో నాకే తేలియకుండా అలా ఐయ్యింది అని చెప్తుంటాడు ఆనంది ఓకే అండి నేనెప్పుడూ మీకు కనిపించను సారీ అని బయపడ్తూ,ఏడుస్తూ చెప్తది .అర్జున్ హే అలా కాదు నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు నేను నీకు ఇప్పుడు సారీ చెప్పడానికే పిలుపిచ్చా నువ్వే నాకు సారీ చెప్తున్నావ్ ఏంటి అని అంటాడు ,ఓకే అండి నాకు పని ఉంది నేను వెళ్ళాలి అని వణుకుతూ వెళ్ళిపోతది ఆనంది,హే సారీ అని గట్టిగ ఒర్లుతాడు అర్జున్ ,ఆనంది వెనక్కి తిరిగి చూసి ఎం మాట్లాడకుండా హడావిడిగా వెళ్ళిపోతది ,పద్దు ఆనందిని బైక్ వరకు పంపిచడానికి వెనకమలనే వెళ్తది.
మరల లోపలికి వచ్చి అర్జున్ తో ఇలా అంటది పద్దు, నేను నిన్ను తనకి సారీ చెప్పమని చెప్పా కానీ నువ్వు ఏం చేసావు తనని మరల ఏడ్పిచావు ఏంటి అర్జున్ ఏమైంది నీకు అసలు అని అంటది ,ఇంతలో కిరణ్ పద్దు తో ఇలా అంటాడు హే హే ఆగు,అర్జున్ ఎక్కడ ఏడ్పిచ్ఛాడు పెద్ద పెద్ద డైలాగులు కొట్టింది మనోడు కనబడగానే కూలాయి తిప్పింది అంటాడు ,ఇంతలో రోహిత్ కిరణ్ తో నువ్వు ఆగు ర బాబు అన్నిటికి ఒర్లుతావు అని అంటాడు ,అసలు మనం పిచోళ్లలా అనుకోడమే వాడికి ఎం అవ్వదు చూడు ఎంత హ్యాపీ గా ఫోన్ లో చాల సీరియస్ గా చూసుకుంటున్నాడో అని ఆ ఫోన్ లాక్కొని చూస్తది పద్దు, అది సీసీ టీవీ ఫ్యూటేజీ ,అది చూసి షాక్ కి గురవుతారు అందరూ ఇంకా కోపం తో పద్దు అర్జున్ ని తిడ్తది ఏంటిది అసలు నీకు ఎవరు ఇచ్చారు ఈ ఫ్యూటేజీ,అసలు నీకు చిన్న భయం కూడా లేదు నీ సావు కి నువ్వే గోతి తవ్వుకుంటున్నావా అని తిడుతూ ఉంటది ఇంతలో రోహిత్ ఎలాగైనా ఈ గొడవని ఆపాలి అని నువ్వు పదా లేట్ అవుతుంది మల్లా వార్డెన్ తిడ్తది నేను చెప్తాలే వాడికి నువ్వు ఎక్కువగా ఆలోచించకు పదా అని పద్దు ని అక్కడ నుంచి తీస్కొని పోతాడు,ఇంతలో కిరణ్ అర్జున్ దెగ్గరికి వచ్చి ఎంతయినా నువ్వు సూపర్ రా ని గట్స్ కి నీ థాట్స్ కి అసలు ఎవరూ పోటీగా రారు అంటాడు ,అర్జున్ నవ్వుతు సరే మరి నేను రేపు వూరు వెళ్ళాలి అని చెప్పా గా పోతా ఇంకా అని అంటాడు ,అవును రా బాబు నేను కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలి ఏమన్నా ఫెస్టివల్ వస్తే చాలు ఈ టికెట్స్ రేట్ లు పెంచుతాడు అయినా కూడా ఎగబడి మరి కొంటారు ,నువ్వు బెటర్ లే ముందే మేల్కున్నవ్ నేను కూడా బుక్ చేసుకోవాలి అంటాడు కిరణ్, అర్జున్ ఒక్క చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు తన బైక్ ఏస్కోని .
పద్దు హాస్టల్ లో వెయిట్ చేస్తూ ఉంటది ఆనంది కోసం, బాగా లేట్ అయితది, ఆనంది అప్పుడే వస్తది ,వచ్చావా ఏంటి లేట్ అయింది ఇవ్వాళ అని అంటది, ఏంలేదు అని చెప్తూ పద్దు మాట్లాడుతున్నా పట్టించుకోనట్టు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతది తన కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి ఏమైందో ఆ లంచ్ కి వచ్చినప్పుడు జరిగింది తలుచుకొని ఏడ్చిందా చాలా బాధ పెట్టానేమో అని అనుకుంటూ ఉంటది ఇంతలో ఆనంది వాళ్ళ ఆఫీస్ లో ఫ్రెండ్ వచ్చి తన బైక్ కీస్ ఇస్తది ఏమైంది ఆనంది ఆఫీస్ లో కూడా ఏడుస్తూనే ఉందా మధ్యాహ్నం జరిగింది తలుచుకొని అని అంటది ,లేదు అసలు తను ఆఫీస్ కి వెళ్ళాక నార్మల్గానే ఉంది అంటది ఆ అమ్మాయి పద్దుతో ,మరి తను ఏడ్చినట్టు అనిపిస్తుంది కళ్ళు కూడా ఎర్రగా అయ్యాయి ఏమైంది అంటది పద్దు ,ఇవ్వాల మా మేనేజర్ తనని ఏడ్పించాడు అంటది, అవునా ఏమైంది అంటది మేము ఆఫ్టేర్నూన్ లంచ్ తరువాత ఎవరి వర్క్ లోకి వాళ్ళు వెళ్ళాము అదే సమయం లో మా మేనేజర్ ఆనంది ని వాళ్ళ ఇంట్లో డిన్నర్ కి ఇన్వైట్ చేసాడు తాను రాలేను అని చెప్పింది ,ఏమైంది నీకు ఒకటి చెప్పాలి ఒక టైపు అఫ్ ప్రమోషన్ ఇస్తా అని అన్నాడు ,థాంక్ యు సర్ బట్ ఐ అమ్ ఫైన్ ,నేను రాలేను అన్నది ,ఏమైందో తెలీ -దు వెళ్లే టైం కి మరల పిలిచాడు ఏదో ఆఫీస్ వర్క్ ఉంది నువ్వు ఉండి చేయాలి అన్నాడు అయితే తప్పని పరిస్థితిలో ఉండవలసి వచ్చింది నేను తనకి తోడుగా ఉన్న , మా మేనేజర్ వచ్చి నాకు వేరే వర్క్ చెప్పాడు నేను చెప్పా నేను ఆనందికి తోడు కోసం ఉన్న టైమింగ్స్ అయిపోయాక కూడా అని ,నీకు ఇచ్చే టైమింగ్స్ ఎ ఆనందికి కూడా ఇస్తారు కానీ ఆనంది చేయట్లేదా వర్క్ ఇప్పుడు ,జాయిన్ అయ్యేముందు పెద్ద పెద్ద డైలాగులు కొడతారు కంపెనీ డెవలప్మెంట్ కోసం 100% కృషి చేస్తాం అది ఇదీ అని టైం అవ్వగానే ఎం వర్క్ చెప్పిన చెయ్యరు ,అసలు మీలాంటోళ్లని పెట్టుకున్నాకే కంపెనీ పేరు పడిపోతది అనిపిస్తుంది అంన్నాడు మేనేజర్,ఇంకా నేను వెంటనే ఆ వర్క్ కోసం బయటకి వెళ్లి వచ్చేసరికి ఆనంది మేనేజర్ చెంప పగలకొట్టడం చూసా చాల కోపంగా ఏడుస్తూ నీ కింద వర్క్ చేస్తున్న అనే గ అడ్వాంటేజ్ తీసుకుంటున్నావ్ కొడితే మొహం పగిలిపోద్ది ,ఎలా కనిపిస్తున్న ,అసలు ని జాబ్ ఒద్దు ని లొల్లి ఒద్దు ,రేపు ఉదయమే ని టేబుల్ మీద నా రెసిగ్నేషన్ లెటర్ ఉంటది అని అన్నది,మా మేనేజర్ కూడా నన్నే కొడ్తావా నీకు ఇంకెక్కడా ఎలా జాబ్ వస్తదో నేను చూస్తా అని అన్నాడు అని చెప్తది ఆ అమ్మాయి పద్దు తో ,సరే కానీ ఇవన్నీ నేను నీకు చెప్పినట్టు తనతో అనకు నేను రేపు ఉదయాన్నే వస్తా అని చెప్పు అని చెప్పి వెళ్ళిపోతది .
ఆనంది రాగానే వాళ్ళ అమ్మ కి ఫోన్ చేసి ఇలా మాట్లాడతది, హలో అమ్మ ఎం చేస్తున్నారు హా నేను బనే ఉన్నా ఇప్పుడే వచ్చా ,హా తిన్నా ,మీరు తిన్నారా ,ఎం లేదు అమ్మ నేను జాబ్ మానేశా ,ఆ జాబ్ చాల కష్టంగా ఉంది నేను చేయలేకపోతున్న వేరే జాబ్ చూసుకుంటా అని చెప్తది,నేను ఈ పండగ కి రావట్లేదు అని చెప్తది కాల్ మాట్లాడటం అయిపోతది ,తరువాత పద్దు వచ్చి సారీ ఆనంది నా వల్లే నువ్వు మళ్ళి ఇవ్వాళ ఏడ్చవ్ నేను అతను సారీ చెప్తాడు అని రమణి చేప్పా మొన్న కూడా నా వల్లనే ఇదంతా జరిగింది అని అంటది సర్లే వదిలేయి అందరూ అంతేలే ని తప్పు ఎం లేదు నీకు తెలీదుగా అతను అలాంటోడు అని అంటది ,లేదు నువ్వు మొన్న జరిగింది మనసులో పెట్టుకొని అతన్ని తప్పు గ అనుకుంటున్నావు అతను చాల మంచోడు ఆ రోజే ఏదో కంట్రోల్ లో లేక అలా చేసాడు లేదంటే అతని అంత మంచి వాళ్ళు వుండరు అసలు అమ్మాయిల జోలికి వెళ్ళడు ఎవరిని బాధ పెట్టాడు మంచి సహాయగుణం కలిగిన వ్యక్తి అని చెప్తది ఇంతలో ఆనంది చాలు ఇంక ఆపు, అతని గురించి చాల బాగా తెలిసినట్టు చెప్తున్నావ్ గా అంటది ,పద్దు అవును నాకు అతను చాల బాగా తెల్సు 2 ఇయర్స్ నుంచి తెల్సు అని చెప్తది ,ఆనంది ఎం తెల్సు నీకు అతని గురించి నీకు ఎం తేలిదు అంటది ,పద్దు కి కోపం వస్తున్నా కూడా అయ్యో నాకెందుకు తేలిదు అతను నా ఫ్రెండ్ అని చెప్తది 2 ఇయర్స్ గ మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్తది ,అవునా అతని పేరు ఏంటి ,అతనిది ఏ ఊరు ,అతను ఎవరెవరిని కాలుస్తాడు ,అసలు అతని బాషా ఏంటో నీకు తెల్సా ,అతని రిలీజియన్ అండ్ రీజియన్ నీకు తెల్సా ,నీకు ఎం తేలీదు నీకే కాదు ని గ్యాంగ్ లో ఎవరికీ ఎం తేలిదు అతని గురించి అంటది ఆనంది కొంచం గట్టిగ ,అవునా ఇంత చెప్తున్నావ్ మరి నీకు తెల్సా అతని గురించి ఏయ్ ఆధారం తో అతను మంచోడు కాదు అని చెప్తున్నావ్ అంటది ,నేను ఆదారాలు లేకుండా ఒకరిని అనను అసలు, చెప్పాలి అంటే అతను భారత దేశపు మునిషి ఏ కాదు ,అతని బాష తెలుగు కాదు,అసలు అతని మొహం మనకి కనిపించేదే కాదు అతని వెంబటే ఎప్పుడూ కనీసం 50 మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అతను ఏదో చేస్తున్నాడు ఈ దేశం లో మిమ్మల్ని మీకు తెలీకుండానే వాడేస్తున్నాడు అని అంటది ఆనంది .
పద్దు ఆనంది మాటలు వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా, కొన్ని కొన్ని సంఘటనలు తలుచుకుంటే నమ్మేలా ఉన్నాయి ,ఇదంతా నీకు ఎలా తెల్సు అని అడుగుతది పద్దు నేను అతనిని ఆ కేఫ్ లో కలవడానికి ఒక వారం ముందు గానే చూసా ,నేను ఆ రోజు నా ఫ్రెండ్ బైక్ పాడయిపోతే నేను తాను కలిసి బస్సు లో వచ్చాం , అప్పుడు నేను ఇతన్ని ఒక పెద్ద కాళీ స్థలం లో ఒక గన్ పట్టుకొని ఎవరితోనో చాల సీరియస్ గ మాట్లాడటం చూసా ,అది నాకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగివ్వలే కానీ బస్సు రాగానే అతను ఏమి తేలినట్టు చాల మాములు వ్యక్తి ల వచ్చి బస్సు లో కూర్చోడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది అదే సమయం లో ఎవడో నా వైపు చూస్తూ నన్ను పిలుస్తూ ఉండటం వల్ల నేను అటుగా చూడటం మానేశా ఆ తరువాత ఆ అర్జున్ మేము ఉన్న బస్సు లోనే వచ్చాడు ,కానీ నేను అతనిని చూడ దలుచుకోలే ,నా పని నేను చూసుకున్న ,ఆ రోజు నాకు అతను ముద్దు పెట్టె సమయంలో అతని మొహం నిజమయినది కాదు అనే భావన నాకు కలిగింది అతను ఒక పశువు లా బిహేవ్ చేయడం వళ్ళ నాకు ఆ రోజు భయం వేసింది ,తరువాత రోజు నేను అతని గురించి ఆలోచిస్తూ ఆఫీస్ లో ఉండగా మా మేనేజర్ నన్ను ఊరికినే ఇబ్బంది పెడ్తూ ఉన్నాడు ప్రతి విష్యం లో నన్ను కదిలిస్తూ ,నేను లంచ్ కి వచ్చాక అతను టేబుల్ మీద పెట్టిన ఫోన్ లో అతనికి అన్నోన్ ఇంటర్నేషనల్ కాల్ ఒకటి వచ్చింది అతను దాన్ని అప్పుడు పట్టించుకోలే కానీ నాకు ఒక క్లారిటీ వచ్చింది నేను అతని గురించి విచారం మొదలు పెట్టా కానీ నాకు ఎటు వంటి గుర్తులు దొరకలే అతని మొహం కూడా నిజం కాదు కాబట్టి నాకు ఎం చేయాలో అర్ధం కాలేదు ,కానీ ఆ కాల్ మాత్రం ఆస్టిన్ అనే ప్రదేశం నుంచి వచ్చింది అని అర్ధం అయింది .
ఇవన్నీ విన్నాక తల తిరుగుతున్నట్టు అయింది పద్దు కి ,నువ్వు చెప్పేది చాలా కష్టంగా ఉంది నమ్మడానికి అర్జున్ ని ఆలా ఉహించుకోడం కూడా నాకు చాల బాధాకరంగా ఉంది అని అంటది ,ఆనంది నీకు నమ్మాలి అని లేకపోతే అతన్నే డైరెక్ట్ గా అడుగు అంటది ,పద్దు అర్జున్ ఫోన్ కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తది కానీ స్విట్చెడ్ ఆఫ్ అని వస్తది ,ఆనంది వెటకారంగా నవ్వుతూ స్విట్చెడ్ ఆఫ్ ఆ లేకపోతే ఎంగేజ్ వస్తుందా అంటది ,పద్దు స్విట్చెడ్ ఆఫ్ అని అంటది నాకు తెల్సు ఆడు అప్పుడో ఫరార్ అయ్యి ఉంటాడు అని నవ్వుతది,పద్దు రోహిత్ కి కాల్ చేసి అడుగుతది అర్జున్ ఎక్కడ అని, రోహిత్ ఏమో అర్జున్ ఆ ఊరు వెళ్తున్న అని చెప్పాడు అంటాడు ఏ ఊరు అని చెప్పాడు అంటది ,ఊరు పేరు అడగలేదు అంటాడు ,నీలాంటి ఒక ఎదవ సన్నాసిని నేను ప్రేమిస్తున్న చీ అంటది పద్దు ,అరేయ్ ఏమైంది నేను ఇప్పుడు ఎమన్నా, నిన్న వాడిని అడగటం మర్చిపోయా అంటాడు ఏడ్చవ్ లే ఇప్పుడు కాల్ చేసి ఎక్కడ ఉన్నడో అడుగు అంటది పద్దు , ఎందుకు ఇప్పుడు , అయినా వాడి ఫోన్ ఏదో అయింది అని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు స్విట్చెడ్ ఆఫ్ లో ఉంది నా దెగ్గరే అంటాడు, ఏమైందో చెప్పు అంటాడు రోహిత్ ,చాలా కోపంగా ఎం కాలేదు అని ఫోన్ కాల్ కట్ చేస్తది పద్దు ,తరువాత నువ్వు చెప్పేది నిజం లానే ఉంది ఏదో తేడా కొడుతుంది అంటది పద్దు . నిజం నిప్పు లాంటిది అదే కాల్చేస్తది లే నువ్వు గమ్మునుండు అంటది ఆనంది ,లేదు ఆనంది మమల్ని ఇంత పిచోళ్ళని చేసాడు నేను రేపు వెళ్లి వాడి సంగతి ఏంటో కనుకుంటా అంటది పద్దు ,అంత ఈజీ కాదు పాప నువ్వు ఎప్పుడు వస్తావా అని అన్ని ఓపెన్ గా పెట్టడు అతని డోర్స్ ,ఎనీ వేస్ ఐ విష్ యూ ఆ లక్ ,నేను ఇంకో జాబ్ కి అప్లై చేసుకోవాలి రేపు ,ఏంటో నీకు ఇదంతా చెప్పాక నా మనసు తేలికగా ఉంది ఇంక నిద్రపోతా అని చెప్పి నిద్రపోతది ఆనంది.. కానీ పద్దు కి మాత్రం అసలు నిద్ర పట్టదు ఉదయాన్నే లేచి రోహిత్ ని తీస్కొని అర్జున్ ఇండియా లో ఉన్నప్పుడు ఉన్న రెంట్ హౌస్ దెగ్గరికి వెళ్తారు ఆ హౌస్ ఓనర్ ముందు నిరాకరించినా తరువాత రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు చాలా సేపు వెతికినా ఏమి దొరకవు ఆధారాలు , ఇంక తిరిగి వెళ్ళిపోతారు వీళ్ళు , తన కోసం వీళ్ళు వెతుకుతున్న విషయం అర్జున్ అనుచరుల ద్వారా తెలుసుకుంటాడు .
*****************6 నెలలు తరువాత *********************
ఒక్క రోజు రోహిత్,పద్దు మరియు మిగతా స్నేహితులకు ఒక చోటుకు రమ్మని ఒక కాల్ వస్తది, వీరంతా వెళ్తారు అక్కడ అందరూ చాలా గొప్పగా ఒకేరకమైన దుస్తులు ధరించి చాలా క్లాసీగా మరియు మాస్ గా ఉంటారు ,లోపలికి వీళ్ళని డైరెక్ట్ చేస్తారు లోపల ఒక వ్యక్తి చాల పొడుగ్గా అందంగా తెల్లగా పోష్ గా చూడగానే "అబ్బా ఏమున్నాడు" అనుకునే విధంగా వున్నాడు , పద్దు అతన్ని అలానే చూస్తూ ఉంటది ఇంతలో రోహిత్ హే ఎం చూస్తున్నావ్ కొంచం కను రెప్పలు అయినా కొట్ట -వే నాకు భయం అయితుంది అంటాడు ,అరేయ్ నువ్వు ఆగు రా అంటది పద్దు ,అందరూ అతని ముందు కూర్చుంటారు ఒక 10 సెకండ్స్ పాటు అంతా నిశబ్ధoగా ఉంటది , ఇంతలో కిరణ్ ముందుగా మాట్లాడతాడు ఎవరండీ మీరు మమల్ని ఎందుకు రమ్మని పిలిపించారు అని అడుగుతాడు ,ఆ వ్యక్తి మీరు అనకండి నాకు కొంచం కష్టంగా ఉంది ఆ పదం నీ నుంచి వింటుంటే అంటాడు ,మీకు మేము తెలుసా అంటడు రోహిత్. అయ్యో చాలా బాగా తెల్సు మీకు కూడా నేను తెల్సుగా రోహిత్ ఏంటిది అప్పుడే మర్చిపోయారా అని అంటాడు,హే మీరు ఆగండి అర్జున్ అంటది పద్దు ,అర్జున్ రెడ్డి ఆ అంటది ,పద్దు నువ్వు నన్ను మర్చిపోలేవు లే పద్దు అవును నేను అర్జున్ రెడ్డి ల మీకు రెండు సంవత్సరాల క్రిందట ఒక ఆక్సిడెంట్ వల్ల పరిచయం అయినా అర్జున్ చక్రబోర్తి అంటాడు , అందరూ కొంచం సేపు షాక్ లో ఉంటారు వెంటనే కిరణ్ లేసి ఏంటి ఇన్ని రోజులు మమల్ని మోసం చేసావా వేరే పేరుతో అసలు ని మొహం కూడా మేము చూడకూడదు అనుకున్నాం అందుకే మార్చు కొని వచ్చాడు లేరా నువ్వు కుర్చొ అంటా -డు ఆ గ్యాంగ్ లో ఇంకొకతను ,అవును నేను మిమల్ని మోసం చేయాలి అని అలా చేయలేదు, అసలు నాకు మీథో ఎటువంటి ఉపయోగం కూడా లేదు కానీ ఎందుకో నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు మీరు ,నేను ఇండియా కి వచ్చిన పర్పస్ మీకు చెప్పాలి అని నాకు ఎప్పుడు అనిపివ్వలేదు ఉన్న కొన్ని రోజులు మీతో సరదాగా గడిపేసా నేను వచ్చిన పని అయిపోయాక నేను తిరిగి మా దేశానికి వెళ్ళిపోయా అంటాడు ,మీది ఎక్కడ ఏ దేశం అంటడు రోహిత్ ఓ చెప్పడం మర్చిపోయా నాది ఆస్టిన్ నేను అక్కడ యువ రాజు ని ,మీకు ఇది వినడానికి కొంచం కొత్తగా ఉన్నా ఇదే నిజం ,నేను ఇండియా కి ఒక పని మీద వచ్చా మాకు ఒక సమాచారం వచ్చింది ప్రపంచ దేశాలలో ఒక దేశం మరల మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం అవుతుంది అని మేము ఏ విధమైన యుద్ధానికి సిద్ధంగా లేము కావున ఆ యుద్ధాన్ని ఎలాగైనా మేము మొదలు అవ్వకుండా చూడాలి అనుకున్నాం మాకు ఒక పరిశోధక కేంద్రం ఉంటది ,మేము ఎన్నో రోజుల గాఢమైన సంభాషణల తరువాత మా పరిశోధన కేంద్రంలో ఒక మందు కనుగోవడం అది ఈ సమస్యని ఆపేలా ఉందని భావించాం కానీ దురుదుష్టవసాతు మా దేశం లో ఆహ్ పంట లేకపోడం వాళ్ళ వేరే దేశాల్లో ఎక్కడ ఆ మందు కి కావాల్సిన పదార్థాలు దొరుకుతాయా అని చూడగా భారత దేశం లో అని తేలింది ,మేము ఇది ఎవరికీ చెప్పకుండా చేస్తున్న పని కావున మాకు ఇండియా లో నుంచి ఆ ఆకులని సేకరించి మా కేంద్రానికి తీస్కపోయే అనుమతి లేదు ,మా నాన్న గారు నాకు ఈ పని ని అప్పజెప్పారు నేను అందుకనే వచ్చాను కానీ నా నిజమైన మొహం చూపిస్తే ఇది చేయడం కష్టం అనిపించింది అని అంటాడు . నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ నీకు ఇంత స్పష్టంగా తెలుగు ఎలా వచ్చు అంటది పద్దు ,అది మాకు శిక్షణ లో నేర్చుకున్నది మేము మా శిక్షణ లో భాగంగా మొత్తం అన్ని బాషలలో పట్టు సాధిస్తాం అంటాడు అర్జున్ , మరి నువ్వు ఆనందిని ఎందుకు అలా చూడగానే ముద్దు పెట్టుకున్నావ్ అని అంటది పద్దు ,నేను ఆనందిని మొట్ట మొదటిసారి ఒక బస్సు లో చూసా అప్పుడే నాకు నచ్చేసింది ,నేను ఆ రోజు అంతా తనని చూస్తూనే వున్నా ,తరువాత తాను కేఫ్ దెగ్గరికి వస్తే నాకు ఆ రోజు గుండెలో ఏదో కష్టంగా అనిపించింది, అప్పుడే తాను అంటే నాకు ఇష్టం అని ఫిక్స్ అయ్యా నేను బయటకి వచ్చేలోపులో మీరు వెళ్లిపోతున్నారు తాను నా నుంచి దూరంగా పోడం నాకు కష్టమనిపించింది మరల చూడాలి అనిపించింది నేను వచ్చి తనని చూడగానే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయా ,ఐ రియల్లీ లవ్ ఆనంది అంటాడు. మీకు నా వల్ల ఏదయినా బాధ కలిగి ఉంటె నన్ను క్షమించండి అంటాడు , అలా ఏమి లేదు నువ్వు మాకు ఇప్పటికీ ఎప్పటికీ ఒక మంచి ఫ్రెండ్వి అంటారు అందరూ ఇంతలో రోహిత్ నువ్వు యుద్ధం అన్నావ్ గా ఎవరు మొదలేడుతున్నారు ఎందుకు మొదలేస్తున్నారు ఏంటి వాళ్ళకి ఆ యుద్ధం వల్ల వచ్చే ఉపయోగం మీరు ఆ యుధాన్ని ఈ ఆకులతో ఎలా ఆపుతారు అని అడుగుతాడు , అర్జున్ ఇలా చెప్తాడు ,ఆ యుధాన్ని మొదలేసేది నిజమే అయినా ఎవరు మొదలేస్తున్నారో తేలీదు తప్పకుండా ఉన్నత స్థాయిలో ఉన్న దేశాలలో ఒక దేశం అల్లుతున్న కథ ఇదంతా మేము ఇండియా నుంచి తీస్కపోతున్న ఈ ఆకు మీకు ఏ విధంగా పనికి రాదు కానీ అది మాకు పనికొస్తదని ఇవ్వమని చెప్పినా , మీ దేశం లో ఉన్న కొంతమంది మేము లాభం చెందుతాం అని అది మాకు ఇవ్వడానికి సిదంగా లేరు ,కాబట్టే మేము దానిని దొంగలిస్తున్నాం ఏది తప్పు అయినా కూడా అందరి మేలు కోసం చేసే తప్పు కూడా తప్పు కాదు అనే భావన ,ఆ ఆకులని ఉడకబెట్టి తరువాత దానిని మేము ఆవిరి రూపం లోకి తీస్కోచి దాన్ని హీలియం బల్లూన్స్ లో దాచిపెడ్తామ్ యుద్ధం మొదలవ్వగానే ఆ బెలూన్లని వాళ్ళ మీద కి వేసి వాటిని పేల్చేస్తాం ఆ ఆవిరి పీల్వడం వాళ్ళ వారు గతాన్ని మర్చిపోతారు ,దంతో అసలు యుద్ధనికి వాచం అనే ఆలోచన కూడా వాళ్ళకి గుర్తుండదు అని చెప్తాడు .
ఎలాగూ వచ్చావు కదా ఒకసారి ఆనందిని కలవమని అడుగుతది పద్దు , ఇప్పుడు ఆనంది ని కలవడానికి నిరాకరిస్తాడు ఈ యుద్ధం లో సఫలం అయ్యాక తనని ఓప్పిoచి తనతో తీస్కొని పోతా అని చెప్పి వెళ్ళిపోతాడు .... కొన్ని రోజులు గడిచాకా అనుకున్న విధంగానే ఒక యుద్ధం మొదలవుతది అప్పుడు అర్జున్ ఆ యుద్ధం లో తాను అనుకున్న విధంగానే ప్లాన్ ని అమలు పరుస్తాడు కానీ ఒక సందర్భం లో అవతల దేశపు రాజు మీద ఈ ఆవిరి చల్లగా అది అర్జున్ మీద కూడా పడి గతాన్ని మర్చిపోతాడు,కానీ యుద్ధం లో వీరునిలా పోరాడి విజయాన్ని సాధిస్తాడు ,అర్జున్ గతం మర్చిపోయాడు అని వార్తల ద్వారా తెల్సుకున్న పద్దు ,రోహిత్ మరియు వారి స్నేహితులు ,ఈ సంభాషణ అంతా ఆనందికి తెల్సేలా చేసి ఒక సంవత్సరం కృషి చేసి ఆనందిని ఆస్టిన్ తీస్కొనిపోయి అక్కడే యువరాజు అయినా అర్జున్ ని కల్పిస్తారు ,అర్జున్ గతం మొత్తం మర్చిపోయినా ఆనందిని చూడగానే గుర్తు పడతాడు తన గతాన్ని ఆనంది కి అతనికి జరిగిన సంగతాలుని మాత్రం గుర్తు చేసుకోగలుగుతాడు కానీ ఆ స్నేహితులను గుర్తపట్టలేడు ఏదయినా ఆనంది అర్జున్ మరల కలవడం వారి స్నేహితులకి చాలా ఆనందాన్ని కలగజేసింది .... మరలా ఆనంది ద్వారా వీరు అంతా అర్జున్ కి కొత్త స్నేహితులు లా పరిచయం అవుతారు ఇంకా అందరూ ఆస్టిన్ లో సెటిల్ అవుతారు .... అర్జున్ ,ఆనంది వివాహం జరుగుతది .
Comments
Post a Comment