Posts

Showing posts from October, 2021

Arjunathantram

                                          ఓపెన్ చేస్తే షాట్ లోకి ఓక బస్ వచ్చి ఆగింది ,కొంతమంది బస్సు ఎక్కారు ఇంకొంతమంది దిగారు ,అది హైదరాబాద్ నగరం బస్సు కదులుతూ ఉండగా అక్కడే రోడ్ మీద ఒక అతను ఆ బస్సు వయిపుగా చూస్తూ సిగ్గు పడ్తూ ఎవరినో చూసి నవ్వుతూ ఉంటాడు ,  వెనకాల  ఒక విండో సీట్ లో ఒక అతను పాటలు వింటూ బయటకి చూస్తూ ఉంటాడు ఇతనే మన  కథానాయకుడు అతనికి ఈ మనిషి కనిపిస్తాడు ఎవరికి  సైగలు చేస్తున్నాడా అని చూడగా ఒక   అందమైన అమ్మాయి తాను కూడా పాటలు వింటూ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది . తనే  మన కథానాయకురాలు ,తనని మొట్టమొదటి సారి చూడగానే గుండెల్లో గంటలు మ్రోగుతాయి మన కథానాయకునికి , బస్సు మరల స్టార్ట్ అయితది ఇంక మన కథానాయకుడు బస్సు జర్నీ అంతా మన కథానాయకురాలిని  చూస్తూనే   గడిపేస్తాడు . మన కథానాయకురాలి పేరు ఆనంది తను  ఒక సాఫ్ట్వేరు  ఉద్యోగిని .                  ...