Arjunathantram
ఓపెన్ చేస్తే షాట్ లోకి ఓక బస్ వచ్చి ఆగింది ,కొంతమంది బస్సు ఎక్కారు ఇంకొంతమంది దిగారు ,అది హైదరాబాద్ నగరం బస్సు కదులుతూ ఉండగా అక్కడే రోడ్ మీద ఒక అతను ఆ బస్సు వయిపుగా చూస్తూ సిగ్గు పడ్తూ ఎవరినో చూసి నవ్వుతూ ఉంటాడు , వెనకాల ఒక విండో సీట్ లో ఒక అతను పాటలు వింటూ బయటకి చూస్తూ ఉంటాడు ఇతనే మన కథానాయకుడు అతనికి ఈ మనిషి కనిపిస్తాడు ఎవరికి సైగలు చేస్తున్నాడా అని చూడగా ఒక అందమైన అమ్మాయి తాను కూడా పాటలు వింటూ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నవ్వుతూ ఉంది . తనే మన కథానాయకురాలు ,తనని మొట్టమొదటి సారి చూడగానే గుండెల్లో గంటలు మ్రోగుతాయి మన కథానాయకునికి , బస్సు మరల స్టార్ట్ అయితది ఇంక మన కథానాయకుడు బస్సు జర్నీ అంతా మన కథానాయకురాలిని చూస్తూనే గడిపేస్తాడు . మన కథానాయకురాలి పేరు ఆనంది తను ఒక సాఫ్ట్వేరు ఉద్యోగిని . ...